టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రం విజయోత్సవ వేడుకలు

 *ఆనందపురం* : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విజయవంతం అయిన సందర్భంగా నీలకుండీలు కూడలిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేసి హంగామా చేశారు.
 ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి, హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పాలాభిషేకం, పూలాభిషేకం, పసుపు నీళ్ళ తో అభిషేకం చేశారు. 
అనంతరం టీం తారక్ ట్రస్ట్ విశాఖపట్నం జిల్లా కో - ఆర్డినేటర్ లెంక సురేష్ మాట్లాడుతూ సినిమా విజయవంతం అయిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరో కు నటన లో, నాట్యం లో ఎవరు సాటి లేరని ఈ సినిమా తో మరో సారి రుజువైంది అని అన్నారు.

 రాజమౌళి ఒక అద్భుతమైన, దేశం గర్వించ దగ్గ సినిమా తీశారు అని, సినిమాలో ఇద్దరు హీరో ల పాత్ర కు న్యాయం జరిగేలా చిత్రం తెరకెక్కించారు అని కొనియాడారు అన్నారు. 

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఉమ్మిడి సురేష్, నాగిశెట్టి పృథ్విరాజ్, పడాల భాస్కర్ రావు, పక్కుర్తి అప్పలనాయుడు, బూర్లు శ్రీను, గండ్రేడ్డి భారత్, బూర్లు రవి, పక్కుర్తి సాయి, బొత్స రవి, మజ్జి అశోక్, నాగిశెట్టి సురేంద్ర, బూర్లు ప్రసాద్, నితిన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.