Ujf, ssamna (apujw)
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల చైర్మన్ ఫాకల్టీ అఫ్ లా ఆచార్య దాసరి సూర్య ప్రకాష్ రావు ను ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్,స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ( (ఏపీయూడబ్ల్యూజే )ఈరోజు అభినందిస్తూ ఘనంగా సన్మానించాయి.
అంకితభావంతో క్రమశిక్షణతో మూడు దశాబ్దాలుగా పాత్రికేయ రంగానికి సమాజానికి ఎప్పుడు అవసరమైనా నేనున్నాను అంటూ తన విలువైన న్యాయ పరమైన సూచనలు అందించి నేను సైతం అని మీడియా కు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి ఆచార్య డి.ఎస్.పి.
ఆచార్యులుగా యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలకు,అనేక జీవోలు కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో న్యాయకోవిదులు గా విశాఖలో జరిగిన అనేక సమావేశాల్లో పాల్గొని తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి సెమినార్ ముగింపు సందర్భంగా ఆచార్య డీఎస్పీ ని పలువురు ఘనంగా సన్మానించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య పి. వి. జి. డి ప్రసాదరావు, రిజిస్టర్ ఆచార్య కృష్ణమోహన్, ఆచార్య A. లక్ష్మీనాథ్, ఆచార్య ఆర్.వెంకట్రావు, ఆచార్య వి. విజయలక్ష్మి, న్యాయకోవిదులు,న్యాయ విద్యను అభ్యసిస్తున్న పరిశోధనా విద్యార్థులు, అధ్యాపక బృందం ప్రొఫెసర్ డిఎస్పీ ని ఘనంగా సన్మానించారు.
సన్మాన కార్యక్రమం లో పాత్రికేయులు డాక్టర్ ఎం ఆర్ న్. వర్మ, డి.హరనాథ్, కుమార్, చక్రవర్తి, నాగేంద్ర, రాజు పాల్గొన్నారు.