- *స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్*
భీమునిపట్నం జనసేవ న్యూస్ *భీమిలి యూనిట్ సభ్యులకు నిత్యావసర సరుకులు,స్వీట్లు పంపిణీ*
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆశయ ఫలాలను అందరికి అందివ్వడమే లక్ష్యమని
ఎస్సిఆర్డబ్ల్యూఏ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు..స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉగాది సంబరాలు- 2022 లో భాగంగా భీమిలి ప్రెస్ క్లబ్ లో అసోసియేషన్ సభ్యులకు నిత్యావసర సరుకులు, మిఠాయిలను పంపిణీ చేశారు.
.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్లుగా జర్నలిస్టుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు..
అసోసియేషన్ సేవలను గ్రేటర్ విశాఖ మొత్తం అందించడానికి అందరి సహకారంతో పనిచేస్తున్నామని అన్నారు..అసోసియేషన్ తరపున అందించే ప్రతి సేవా కార్యక్రమంలో ఎందరో అందిస్తున్న సహాయ సహకారాలు ఉన్నాయన్నారు. అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులకు సహాయపడడంలో దొరికే ఆనందం మాటలతో చెప్పలేనిది అన్నారు. నిబద్ధత క్రమశిక్షణలతో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు..
తమ ఈ లక్ష్యానికి చేదోడుగా నిలుస్తున్న కార్యవర్గ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.. అసోసియేషన్ అభివృద్ధికి భీమిలి యూనిట్ సభ్యులు కూడా బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు..
భవిష్యత్ లో జర్నలిస్టులకు ఎటువంటి కష్టం వచ్చినా అసోసియేషన్ పరమైన సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమంలో ఎస్.ల్ సి.ఆర్.డబ్ల్యూ.ఏ కార్యదర్శి కాళ్ల సూర్య ప్రకాష్,కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్లాజీరావు , సహ సహాయ కార్యదర్శి ఎంపీఏ రాజు, నహిమిలి యూనిట్ సభ్యులు పాల్గొన్నారు