మిందివానిపాలెం లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు :


 ఆనందపురం : మండలంలోని మిందివానిపాలెం గ్రామంలో శ్రీరాముని మందిరం వద్ద గ్రామ ప్రజల సమక్షంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా సీతారాముల కళ్యాణాన్ని పురోహితుని వేద మంత్రాల నడుమ కన్నుల పండుగగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాముల కల్యాణంను వీక్షించారు, రోజంతా రామాలయం శ్రీరామ స్మరణతో మార్మోగింది. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.