*ఆనందపురం* :
మండలంలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీం తారక్ ట్రస్ట్ వ్యవస్థాపకులలో ఒక్కరైనా అజాయ్ తారక్ జన్మదినం సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆనందపురం - పెందుర్తి రహదారిలో గల యాచికులకు, మతిస్థిమితం లేనివారికి మధ్యాహ్నం భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ విశాఖపట్నం జిల్లా కో - ఆర్డినేటర్ లెంక సురేష్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా పేదవాడి ఆకలి తీర్చే అన్నదానం మిన్న అని, ఎండాకాలం లో వృద్దులు తిండి లేక , నీరు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అని, అలా జరగకుండా మా వంతు గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, దీని వలన కొంత మందికైనా ఆకలి తీరుతుందని అన్నారు.
పేదవారి ఆకలి తీర్చడం లో ఎంతో ఆనందం ఉంటుందని, ఆ ఆనందంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గా టీం తారక్ ట్రస్ట్ సభ్యులం భాగస్వాములు కావటం మా అదృష్టం గా భావిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాగిశెట్టి పృద్విరాజ్ , నాగిశెట్టి సురేంద్ర, బూర్లు శ్రీను తదితరులు పాల్గొన్నారు.