రెండు డిపార్ట్మెంట్ల సమన్వయ లోపం ప్రజలకు మురుగు శాపము

తగరపువలస జనసేవ న్యూస్ :- 

తగరపువలస జంక్షన్ నుండి చిట్టివలస జూట్ మిల్ కు వెళ్ళే మార్గంలో లేబర్ క్వార్టర్స్.
 డి. లైన్ వద్ద మెయిన్ రోడ్డు పైన గత ఇరవై రోజుల క్రితం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మెయింటినెన్స్ కార్యక్రమంలో భాగంగా కరెంట్ తీగలు క్రింద వున్న చెట్లను కొమ్మలు, చెట్లను తొలగించి వాటి వ్యర్థాలను రోడ్లపై వదిలేసారని టి డి పి పార్లమెంటరీ సెక్రటరీ పిట్ట సురేష్ అన్నారు .

 ఇంత చెత్తగా ఉన్నా రోజూ అటు వైపుగా అనేకమంది ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అయిన శానిటేషన్ సిబ్బంది క్లీన్ చేయడం లేదని చెప్పారు. 
ఈ విషయంపై శానిటేషన్ సిబ్బందిని అక్కడ ఎందుకు శుభ్రం చేయలేదంట అడుగుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ చెత్తను తీసుకువెళ్లి వేయాలి ఇది తమ పని కాదని చెప్తున్నారు. 

ఈ చెత్త వలన ఆ చెట్ల ఆకులు కుల్లి తద్వారా వచ్చే దుర్వాసన వలన ఈగలు, దోమలు వ్యాపించి అనేక రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు.
 కరోనా తగ్గుముఖం పట్టే టైములో తమ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఎలా అనే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

 జీవీఎంసీ గాని, ఎలక్ట్రిసిటీ సిబ్బంది గాని ఈ చెత్తను తొలగించి ఈ ప్రాంతాన్ని స్వచ్ఛంగా ఉంచవలసిందిగా కోరుతున్నామని ఆయన వివరించారు. 

పి శ్రీనివాసరావు 
భీమిలి రిపోర్టర్