జనసేవ న్యూస్ :ఆనందపురం
ప్రముఖ సంఘసేవకుడు, జనసేవ మాస పత్రిక ఎడిటర్ సిరిపురపు భాస్కర్ రావు హఠాన్మరణం చెందారు.
ఆనందపురం మండలం లోని బోని గ్రామానికి చెందిన భాస్కర్ రావు గత 15 ఏళ్లుగా జనసేవ పత్రికను స్థాపించి విశ్లేషణాత్మకమైన కథనాలు ప్రచురించి మంచి పేరు తెచ్చుకున్నారు. సామాజిక రుగ్మతలను పారద్రోలడానికి కలమే ఆయుధంగా మలుచుకొని తన పత్రిక ద్వారా ఎన్నో వార్తలను వెలుగులోకి తీసుకువచ్చారు.
తద్వారా రాజకీయ నాయకులు, అధికారుల మన్ననలు కూడా పొందారు. అయితే మంగళవారం వేకువజామున నిద్రిస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అతని మరణ వార్త విన్న మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అందరితోనూ కలిసిమెలిసి గా ఉంటూ నిజాయితీపరుడుగా పేరుపొందిన భాస్కరరావు మరణవార్త తెలుసుకున్న స్థానికులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలకు అతీతంగా అందరు నాయకులు వచ్చి అతని భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.