ఆనందపురం: తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి సమైక్య, రాష్ట్ర అధికార ప్రతినిధి గా వ్యవహరిస్తున్న లెంక సురేష్ ను అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త గా నియమిస్తూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.ప్రణవ్ గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
మండలంలోని మిందివానిపాలెం గ్రామానికి చెందిన లెంక సురేష్ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గ ల్లో టిఎన్ఎస్ఎఫ్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ కమిటీలను ఏర్పాటు చేసి, టిఎన్ఎస్ఎఫ్ బలోపేతనికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తన పై నమ్మకం ఉంచి అదనపు బాధ్యతలు అప్పగించిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ కు ధన్యవాదాలు తెలిపారు.