ఘనంగా మాజీ సీఎం జన్మదినోత్సవ వేడుకలు

ఘనంగా మాజీ సీఎం జన్మదినోత్సవ వేడుకలు
 జనసేన న్యూసే:-
ఆనందపురం మండలంలోని వేములవలస కూడలిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి,  విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సలహా మేరకు మాజీ భీమిలి ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు ఆర్థిక సాయంతో ఫ్లైఓవర్ వంతెన కిందన మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు.  ఈ చలివేంద్రాన్ని టిడిపి యువ నాయకుడు, వేములవలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ప్రారంభించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి,  విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడేనని కొనియాడారు. ఇందులో భాగంగా కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ స్థానికంగా ఉన్న దేవాలయాల్లో  తమ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో అతనితోపాటు  స్థానిక యువత కోరాడ రమణ, నడిమింటి అప్పలరాజు, కోరాడ వెంకటరావు, ఎర్రాజీ స్వామి నాయుడు, కొట్యాడ శ్రీను, బోధ నారాయణప్పడు, బోధ  అప్పలరాజు, బాలు  తదితరులు పాల్గొన్నారు.

జనసేన న్యూసే:-
రిపోర్టర్ - కిషోర్