ముస్లిం పాత్రికేయ సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు

✍🏻ముస్లిం పాత్రికేయ సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు🙏🏻

      డాక్టర్ M.R.N.వర్మ సీనియర్ జర్నలిస్ట్, అధ్యక్షులు ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్(ujf)
 రంజాన్ మాసం ముస్లిం లకు ఎంతో పవిత్రమైనది మహనీయుడైన మహమ్మద్ ప్రవక్త ద్వారా వారి పవిత్ర గ్రంథమైన దివ్య " ఖురాన్" ఆవిర్భవించింది ఈ మాసంలో,
 అందుకే పవిత్ర రంజాన్ మాసంగా అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. 
ముస్లిం పాత్రికేయ 
మిత్రులు జుబేర్ గడచినా 12 సంవత్సరాలుగా రంజాన్ మాసంలో హలీం లాంటి ప్రత్యేక వంటకాలు, రుచిగా అందరికి అందుబాటులో సరసమైన ధర లో ఏర్పాటు చేయడం వారి ప్రత్యేకత.
 
 గురువారం రాత్రి 7/04/2022
జర్నలిస్ట్ జుబేర్ పిలుపుతో
 వెళ్ళిన నాకు మాటలలో చెప్పలేని ఆనందం కలిగింది.
  ముస్లిం సోదరుల కోసం, విశాఖపట్నం జగదాంబ సెంటర్ దరి, మల్టి కార్ పార్కింగ్ వెనుక భాగంలో ఏర్పాటుచేసిన హలీం, కిర్ కేంద్రంలో నాకు చేసిన ఘనమైన సత్కారం వారి ఆదిత్యం నా జీవితంలో మరిచిపోలేని ఘటన.

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం నెల రోజుల పాటు నియమ, నిష్టలతో కఠినమైన ఉపవాస దీక్షలు ఆచరించి పుణ్య రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనది. 
దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు, పగలంతా కనీసం లాలాజలం సైతం లోపలికి పోకుండా కంట్రోల్ చేసుకుని, సాయం సంధ్య వేళ హలీం, కీర్ లాంటి ఆహారాన్ని స్వీకరిస్తారు.  
ముఖ్యంగా ముస్లిం సోదరులు తమ సంపాదనలో కొంత శాతాన్ని దానధర్మాల రూపంలో పేదలకు వితరణ చేస్తారు.
  
ఈ పవిత్ర మాసంలో ఆహ్వానించి ఆదిత్య ఇచ్చినందుకు, వారి ప్రేమపూర్వక ఆదరణకు ధన్యవాదాలు 🙏🏻

సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఆనాటి శాసనసభ్యులు చాలా వివరంగా పవిత్ర గ్రంధమైన ఖురాన్, రంజాన్ మాసం ప్రత్యేకత, ఉపవాసదీక్ష, సంపాదనలో కొంత వితరణ అంశాలు తెలియజేసిన నాటి విశేషాలు నేడు గుర్తుకొచ్చాయి.

నాతోపాటు సాక్షి దినపత్రిక
విశాఖ ఎడిషన్ న్యూస్ బ్యూరో చీఫ్ 
,ఫోటోగ్రాఫర్ నవాజ్,
సీనియర్ పాత్రికేయ మిత్రులు కుమార్ అశోక్ రెడ్డి కిషోర్ ఇలా మంది పాత్రికేయ మిత్రులు కలయిక, 
ముఖ్యంగా ప్రాణ మిత్రులు బొమ్మన సత్య రాజ్ కుమార్ కాలవడం, 
 మత సామరస్యంకి ప్రతీకగా నిలిచింది.🙏🏻

భీమిలి రిపోర్టర్ 
పి శ్రీనివాసరావు