చిట్టివలస జూట్ మిల్ లో అగ్నిప్రమాదం రికార్డులు, పుస్తకాలు, ఫర్నిచర్, సీలింగు, గదులు దగ్ధం

  తగరపువలస జనసేవ న్యూస్ :- చిట్టివలస జూట్ మిల్లులో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో లేబర్ ఆఫీస్ లో ఉన్నటువంటి రికార్డులు, పుస్తకాలు, ఫర్నిచర్, సీలింగు, గదులు పూర్తిగా కాలిపోయాయి. 
ఈ వార్త తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్లమెంటరీ సెక్రటరీ పిట్ట సురేష్, ఒకటో వార్డు ప్రెసిడెంట్ తమ్మిన సూరిబాబు,గరే సదానంద,దండి వెంకటేష్,గిడితూరి శ్రీనివాస్, సరగడ నర్సింగ్ రావు, తమ్మిన ప్రకాష్ భీమవరపు ప్రకాష్, పందిరి నాని రెండో వార్డు నుంచి వూళ్ళ దుర్గారావు,పల్ల అప్పలకొండ తదితరులు సంఘటనా స్థలానికి చేరి ప్రమాదం జరిగిన విధానాన్ని, ప్రమాద నష్టాన్ని జూట్ మిల్లు సెక్యూరిటీ వారిని మరియు మేనేజ్మెంట్ ఎంప్లాయ్ రంగూరి రామ్ కుమార్ గారిని అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం దొంగలు రికార్డు రూమ్ కి దొంగతనం కోసం వచ్చారని వాళ్లే ఇలా పుస్తకాలను, పేపర్లను రికార్డులను తగులబెట్టారని సెక్యూరిటీ వారు చెప్పిన కథనం.
యాజమాన్య ప్రతినిధి రామ్ కుమార్ తో మాట్లాడగా రికార్డులకు సంబంధించి డేటా అంతటిని కంప్యూటర్ లో నిక్షిప్తం చేశామని, ప్రమాదం వల్ల కార్మికులకు ఇబ్బంది కలగదని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన విధానాన్ని చూస్తూ ఉంటే ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే పలు అనుమానాలకు దారి తీస్తోంది అని పిట్ట సురేష్ అన్నారు.
ఇంకా రెండు కేసులు కోర్టులో పెండింగ్ వున్నందున, కొంతమంది కి ఇంకా చెల్లింపులు కావాల్సి ఉంది.వార్డు ప్రెసిడెంట్ తమ్మిన సూరిబాబు మాట్లాడుతూ తరచూ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయని తెలిసినా కూడా, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో ఉండటం రికార్డులను మాయం చేయడానికే అయ్యుండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు