బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జివన్ రావు సోము వీర్రాజు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జివన్ రావు సోము వీర్రాజు
భీమునిపట్నం జనసేన న్యూస్ :- 
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జివన్ రావు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొనియాడారు .జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని బీచ్ రోడ్ లో ఆయన విగ్రహానికి రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు తో పాటు ఎమ్మెల్సీ మాధవ్ , బిజెపి రాష్ట్ర విశాఖ అధ్యక్షులు రవీందర్ రెడ్డి తదితరులు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ఎస్సి మోర్చా అధ్యక్షులు కోడూరు సంజీవ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కార్మిక సంఘాల కోసం పోరాడిన మహా వ్యక్తి అన్నారు అంటరానితనాన్ని అరికట్టడానికి అహర్నిశలు కృషి చేశారన్నారు ఎస్సీ మోర్చా జోనల్ ఇంచార్జి విజయ్ బాబు, ఎస్టి మోర్చా అధ్యక్షులు మురళీమోహన్ ,ఓబిసి అధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు ఎస్సీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి, మాధవి లత, జే ఎం పీ చక్రవర్తి,రాజేష్, ప్రకాష్, పోతురాజు, ఎస్సీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా"మల్లేశ్వరి బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేన న్యూస్ :-