జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలు కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపిక

భీమునిపట్నం జనసేవ న్యూస్ : ఈనెల 20వ తేదీ నుండి 23 వరకు ఉత్తర ప్రదేశ్, అయోధ్యలో రామ్ మనోహర్ లోహియా ఆనాథ్ యూనివర్సిటీలో జరగనున్న అఖిలభారత అంతర విశ్వవిద్యాలయ కిక్ బాక్సింగ్ పోటీలో భీమిలి పట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల పిడి డాక్టర్ పి గౌరీ శంకర్ తెలిపారు ఈనెల 4వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ లో ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కిక్ బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. 

ఇందులో భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీ.కామ్ తృతీయ సంవత్సరం చదువుతున్న అక్రమాన రాజేష్, బీ.కామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కర్రి చిట్టిబాబు ఉత్తమ ప్రతిభ కనపరిచారు. వీరిరువురు అఖిలభారత అంతర విశ్వవిద్యాలయ కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించారు .

ఈ మేరకు కళాశాలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ మంజుల, వైస్ ప్రిన్సిపాల్ విద్యాసాగర్ ,ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి గౌరీశంకర్ , ఇతర అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది వీరిరువురునుఅభినందించారు.