యువత అదృశ్యంపై ఫిర్యాదు l అదృశ్యమైన యువతి మురపాల నరసయమ్మ

ఆనందపురం జనసేవ న్యూస్ :
        యువత అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందినట్టు పోలీసులు తెలిపారు. 
వెల్లంకి పంచాయితీ గారి పేట గ్రామానికి చెందిన మురిపాల నరసయమ్మ (21) ఈనెల 29న సాయంత్రం బహిర్భూమికని ఇంటి నుంచి బయటికి వెళ్లి మరలా తిరిగి ఇంటికి రాలేదని సోదరుడు మురిపాల రాము పోలీస్ స్టేషన్క ఫిర్యాదు చేశారు . 

అక్క నరసయమ్మ ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికి.. బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి వాకబు చేసినప్పిటికీ ప్రయోజనం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినట్లు రాము పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు .

 తనకు తల్లిదండ్రులతో పాటు ముగ్గురు అక్కలు ఉండగా ఇద్దరు అక్కలకు వివాహం అయిందని తప్పిపోయిన అక్క నరసయ్యమ్మకు ఇంకా వివాహం కాలేదన్నారు. 

ఈ మేరకు సి ఐ వై రవి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు .

ఆనందపురం రిపోర్టర్
  సిహెచ్ శంకర్రావు