నేడు పలు ప్రాంతాల విద్యుత్ సరఫరాకు అంతరాయం
33/11kv భీమిలి సబ్ స్టేషన్‌లోని 33 kV భీమిలి ఫీడర్, 33 kV కళింగ ఫీడర్ 11kv వేలంకి గ్రామీణ ఫీడర్ , 11kv వేములవలస ఫీడర్ ల పరిధిలోగల పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు నిర్వహణ , చెట్ల నరికివేత కారణంగా జె వి అగ్రహారం, నిడిగట్టు కొత్తవలస, మామిడిపెట, గొల్లలపాలెం, కుమారి పాలెం, బిల్లమెట్ట గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. అలాగే 33/11 కెవి భీమిలి సబ్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాటు చేయబడిందని విద్యుత్ శాఖ ఏ ఈ పి విజయ కుమార్ తెలిపారు. అందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు.
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్