2020 లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత అమాయక ఓటర్లను మభ్య పెట్టడానికి ఇళ్లస్థలాలు అందరికీ అని పేరు పెట్టి వారి పేర్లతో హామీ పత్రాలు ముద్రణ చేయించి కరపత్రాలు మాదిరిగా పంచిపెట్టారు. ఈ హామీ పత్రాల పంపిణీ కి. " పట్టాల పండుగ " అని పేరు పెట్టి భారీ సెట్లు వేసి ప్రైవేటు కార్యక్రమంగా అన్నట్లు అధికారులతో నే ఏర్పాట్లు చేయించి మంత్రులు, రాజ్యసభ సభ్యులు నడుమ భారీ ప్రోగ్రాం కండక్ట్ చేసి హామీ పత్రాలు పంపిణీ చేశారు.
పట్టాల పండుగ కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకున్న స్థానిక నాయకులు హామీ పత్రాలు పొందిన ప్రతి ఒక్కరూ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి, పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తేనే మీకు ఇళ్ల స్థలాలు వస్తాయని, లేకుంటే ఆ హామీ పత్రాల కు స్థలం రాకుండా చేస్తామని బెదిరించి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసిపి కార్పొరేటర్లు గా గెలిచిన ఏడాది తర్వాత హామీ పత్రాలు ఇచ్చిన వారిలో కొంతమందిని మాత్రమే అర్హులుగా ప్రకటించి మిగిలిన వారిని కూడా చెప్తున్నారు.
ఎలక్షన్స్ కు ముందు అర్హులు - ఎలక్షన్స్ అయిపోగానే అనర్హులుగా ఎలా మారిపోయారు. ఎన్నికల ముందు హామీ పత్రాలు ఇచ్చిన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.
ఇలా అవసరం ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుని, పని ముగిశాక నేలకేసి కొట్టే వైసిపి పార్టీ తీరు చాలా అమానుషం.
ఎలక్షన్స్ కు ముందు ఓట్ల కోసం ఒక జాబితా, ఎన్నికలు ముగిశాక సంవత్సరానికి మరొక జాబితా, ఇప్పుడు ఫైనల్ లిస్ట్ అంటూ మరొక జాబితాను విడుదల చేస్తూ అర్హులను తగ్గిస్తుండటం లో మర్మమేంటి?
లబ్ధిదారుల ఫైనలిస్టు అంటూ చెబుతున్న అధికారులు ఆ జాబితాను బహిర్గతం చేయడానికి ఎందుకు సంకోచిస్తున్నారు. ఇది ప్రైవేటుపధకమా, ప్రభుత్వ పథకమా. అడిగిన వాళ్లకు లిస్టు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి ??
మేము చాలా పారదర్శకమైన పాలన చేస్తున్నాం అని చెప్పుకునే వైసీపీ నేతలు ఇళ్ల పట్టాల జాబితాను గుట్టు గా ఉంచడంలో పలు అనుమానాలకు తావిస్తోంది!!!