ఆనందపురం: మండలంలోని రామవరం, శొంట్యం, నీళ్ళకుండీలు వంటి పలు ప్రదేశాలలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామవరం లో దాదాపు పది నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడ సరుకులు, శొంట్యం లో ఒక కుటుంబానికి నెల కు సరిపడ సరుకులు, నీలకుండీలు జంక్షన్ లో వాహన దారులకు, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు.
కోరాడ గ్రామంలో ఎన్టీఆర్ అభిమానులు మధ్యాహ్న భోజన ప్యాకెట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కో - ఆర్డినేటర్ లెంక సురేష్ మాట్లాడుతూ ఆయన మరెన్నో మంచి సినిమాల్లో నటించి, అభిమానులను అలరించాలని అన్నారు. ఆయన పిలుపు మేరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, కేక్ కట్ చేసి ప్రయాణికులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నాగిశెట్టి పృథ్విరాజ్, కోరాడ వైకుంఠ రావు, గౌరినాయుడు, అప్పలరాజు, రాంబాబు, పక్కుర్తి సాయి, కోరుకుండ రమేష్, బూర్లు శ్రీను, పడాల భాస్కర్ రావు, నాగిశెట్టి సురేంద్ర, బాలకృష్ణ, లడ్డు తదితరులు పాల్గొన్నారు.