ఎన్నికలకు ముందు అర్హులైన మేము నేడు ఎందుకు అర్హులం కాదు
జనసేవ న్యూస్
ఇక పట్టాలు పొందిన లబ్ధిదారులు దగ్గరకు వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళస్థలం 1.5 శెంట్ల స్థలం కేటాయిస్తామని చెప్పి ఒక సెంటు స్థలానికి మాత్రమే పత్రాలు అందజేశారు.ఇది ప్రజలను మోసగించడం కాదా
ఇంతవరకు అర్బన్ ప్రాంతంలో అన్ని వసతుల మధ్య నివసిస్తున్న వారికి కనీస మౌలిక వసతులు లేని ప్రాంతంలో ఇల్లు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని నిబంధనలతో కూడిన పత్రాలపై సంతకాలు చేయించుకొని ఇల్లు నిర్మాణం ప్రారంభించక పోయినట్లయితే ఇళ్ళ పట్టాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం అందించే లక్షా ఎనభై వేల రూపాయలతో ఇంటి నిర్మాణం ఎలా పూర్తవుతుంది.
గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా ఇల్లు కట్టుకో లేకపోయినట్లయితే మేమే కట్టిస్తాం అని చెప్పిన మాటకు, మడమ తిప్పకుండా వారందరికీ మీరే ఇల్లు నిర్మాణం చేసి అందించాలని తెలుగుదేశం పార్టీ తరపున పిట్ట సురేష్ డిమాండ్ చేస్తున్నాం.
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్