జనసేవ న్యూస్:
జివిఎంసి పరిధి ఒకటో వార్డు రాజ వీధిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒకటో వార్డు నాయకులు పిట్ట సురేష్, తమ్మిన సూరిబాబు, వానపల్లి సత్యనారాయణ ల ఆధ్వర్యంలో జరిగింది. భీమునిపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు విచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. నాయకులు మరుపిళ్ళ రాజేంద్రప్రసాద్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఐ డి కార్డులు ఇవ్వడం జరిగింది.కోరాడ రాజబాబు మాట్లాడుతూ రాజకీయ పార్టీల సభ్యత్వ నమోదు ఆన్లైన్ లో జరుగుతున్న తొలి పార్టీ భారతదేశంలో తెలుగుదేశమే అని కొనియాడారు. పార్లమెంటరీ సెక్రటరీ సురేష్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు చేయించుకున్న వారికి ప్రమాద భీమా రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ సభ్యత్వ నమోదు కాలపరిమితి రెండు సంవత్సరాలకు వర్తిస్తుంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభిమానులు నాయకులు ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు పాల్గొని సభ్యత నమోదు చేయించుకుని ఐడి కార్డులు పొందారు.
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్
#Ap #Political #janasevanews #trendingnews, #Ap #Tdp #Ysrcp #Congress #Politics #Viralnews #Telugunews #Hyderabad #CBN #Jagan #pspk #pavankalyan #Koradarajababu #BHEMILI #visakhapatnam