అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో బుధవారం నుండి రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇప్పటికే రాష్ట్రంలో పలు నగరాలు జలమయం అయ్యాయి. ఈ కారణంగా ఇంటర్ బోర్డ్ పరీక్షలు వాయిదా వేసింది. రేపటి నుండి జరగాల్సిన ఇంటర్ పరీక్షలను ఈ నెల 25 నుండి నిర్వహించనున్నట్లు బోర్డ్ తెలిపింది.