హైదరాబాద్: TV9 స్టూడియోలో టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ హల్చల్ చేశాడు. విశ్వక్ సేన్ హల్చల్ చేయడంతో టీవీ9 యాంకర్ దేవి అతన్ని బయటకు పంపించేసింది. "అశోకవనం లో అర్జున కళ్యాణం" అనే సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్ సేన్ నిన్న ఫ్రాంక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంక్ వీడియో వివాదాస్పదంగా మారింది.
ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రాంక్ వీడియో పై ఇవాళ టీవీ9లో డిబేట్ జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా స్టూడియోకు వచ్చిన హీరో… యాంకర్ దేవి నాగవల్లి తో డిబేట్ లో పాల్గొన్నాడు. డిబేట్ కొనసాగుతుండగా విశ్వక్ సేన్ డిప్ ప్రెస్ డ్ పర్సన్ అని దేవి అన్నారు. దీంతో విశ్వక్ సేన్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని ఆమె పై నిప్పులు చెరిగాడు విశ్వక్. అయితే.. దీనిపై దేవీ నాగవల్లి కూడా సీరియస్ గా రియాక్ట్ అయి…. విశ్వక్ సేన్ ను స్టూడియోను పంపించేసింది. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.